హైదరాబాద్, సెప్టెంబర్ 26: చైనీస్ రెస్టారెంట్ నిర్వహణ సంస్థ చౌమాన్..తాజాగా తెలంగాణ మార్కెట్లోకి అడుగుపెట్టింది. తన తొలి అవుట్‌లెట్‌ను మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభించింది. దీంతో దేశంలో తన అవుట్లెట్ల సంఖ్య 32కి చేరుకున్నాయి. ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ దేబాదిత్యా చౌదరీ మాట్లాడుతూ..
చైనీస్ ఆహార పదార్థాలకు డిమాండ్ పెరుగుతుండటంతో ఇక్కడ తొలి అవుట్‌లెట్‌ను ప్రారంభించినట్టు, ఈ ఏడాది చివరి నాటికి నగరంలో మరో మూడు అవుట్లెట్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. ఒక్కో అవుట్లెట్లను ఏర్పా టు చేయడానికి కోటి రూపాయల వరకు ఖర్చు అవుతున్నదని, అలాగే 45 మంది సిబ్బందిని నియమించుకుంటున్నట్లు చెప్పారు.