Crypto Currency | దేశంలో వేగంగా విస్తరిస్తున్న క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు కళ్లెం వేసేందుకు కేంద్రం యోచిస్తున్నది. వాటిఇ నియంత్రించడానికి చర్యలు చేపట్టనన్నది. ఇందుకోసం ఆదాయం పన్నుశాఖ చట్టంలో సవరణలు తేనున్నదని కేంద్ర ఆర్థికశాఖ రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్ బజాజ్ చెప్పారు. క్రిప్టోపై మీద లాభాలపై మదుపర్లు ఇప్పటికే లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ చెల్లిస్తున్నారన్నారు. దీనిపై జీఎస్టీ చట్టంలోనూ స్పష్టమైన గైడ్‌లైన్స్ ఉన్నాయని తరుణ్ బజాజ్ తెలిపారు.
ఇక క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ చేసేవారు కూడా జీఎస్టీ కింద పన్ను చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పారు. మదుపర్లను ఆకర్షించడానికి భారీగా ప్రకటనలు వెలువడుతున్నాయని, ప్రముఖులు ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో కఠిన నియంత్రణ అవసరం అని ప్రభుత్వం భావిస్తుందన్నారు.