CS Setty | న్యూఢిల్లీ, ఆగస్టు 6: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) చైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి నియామకానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆయన ఈ పదవిలో మూడేండ్లపాటు కొనసాగనున్నారు.
ప్రస్తుతం బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న శెట్టి.. దినేశ్ ఖారా స్థానాన్ని భర్తీ చేయనున్నారు. ఈ నెల 28న బ్యాంక్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఎఫ్‌టీసీసీఐ వైస్ ప్రెసిడెంట్‌గా కృష్ణకుమార్
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామ ర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) వైస్ ప్రెసిడెంట్‌గా కృష్ణకుమార్ మహేశ్వరీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఆయన ఏడాది పాటు కొనసాగనున్నారు.