ట్రేడర్లపై పెను భారం
ఎర్ర సముద్ర సంక్షోభం ముదిరేకొద్దీ వర్తక, వాణిజ్యంపై పెను భారం పడే వీలుందని గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) శనివారం ఓ నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఎగుమతిదారులకు షిప్పింగ్, ఇన్సూరెన్స్ వ్యయం పెరుగుతాయన్నది.
- కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి
- ఎర్ర సముద్ర సంక్షోభంపై జీటీఆర్ఐ
న్యూఢిల్లీ, జనవరి 6: ఎర్ర సముద్ర సంక్షోభం ముదిరేకొద్దీ వర్తక, వాణిజ్యంపై పెను భారం పడే వీలుందని గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) శనివారం ఓ నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఎగుమతిదారులకు షిప్పింగ్, ఇన్సూరెన్స్ వ్యయం పెరుగుతాయన్నది. అందుకే భారతీయ ఎగుమతిదారులకు ఆర్థిక మద్దతును అందించడంపై కేంద్ర ప్రభుత్వం తప్పక దృష్టి సారించాలని అభిప్రాయపడింది. ఈ సంక్షోభం.. షిప్పింగ్ ఖర్చులను 60 శాతం వరకు, బీమా ప్రీమియంను 20 శాతం వరకు పెంచేలా ఉందన్నది.
ఈ క్రమంలోనే ప్రస్తుత పరిస్థితులను చూస్తే.. ఇప్పుడప్పుడే ఈ సమస్య తీరేలా లేదని, దీర్ఘకాలిక రవాణా ఇబ్బందులను భారత్ ఎదుర్కోక తప్పదంటూ.. అందుకు సిద్ధంగా ఉండాల్సిందేనని జీటీఆర్ఐ వ్యాఖ్యానించడం గమనార్హం. ‘వాణిజ్య నౌకలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు రవాణా ఖర్చుల్ని మరింతగా పెంచేస్తున్నాయి. సరుకులు సకాలంలో డెలివరీ కావడం లేదు. దీనివల్ల ఎగుమతిదారుల లాభాలు పడిపోతున్నాయి’ అని జీటీఆర్ఐ పేర్కొన్నది.
ముడి చమురు దిగుమతులపై..
ముడి చమురు దిగుమతుల రక్షణార్థం ఒమన్, జిబౌటి వంటి సంఘర్షణలకు లోనవుతున్న ప్రాంతాలకు వెలుపల ఉండే పోర్టులపై దృష్టి సారించాలని తమ నివేదికలో జీటీఆర్ఐ సూచించింది. అలాగే పశ్చిమ ఆఫ్రికా, అమెరికా, మెడిటరేనియన్ తదితర ప్రాంతాల నుంచి ముడి చమురు దిగుమతుల్ని వైవిధ్యపర్చడం కూడా ముఖ్యమేనని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే వాణిజ్య అవాంతరాలకు గురవుతున్న భారతీయ సంస్థలకు ఆర్థిక సాయం, బీమా పథకాలను కల్పించాలని కోరింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

