మే నెలలో నైనీలో బొగ్గు ఉత్పత్తి!
ఒడిశా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న నైనీ బొగ్గు బ్లాక్ నుంచి ఉత్పత్తిని ప్రారంభించడానికి సింగరేణి సంస్థ సిద్ధమవుతున్నది. మే మొదటి వారం నుంచి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించేయోచనలో సంస్థ ఉన్నట్లు తెలుస్తున్నది.
- సింగరేణికి స్టేజ్-2 అనుమతులిచ్చిన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఒడిశా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న నైనీ బొగ్గు బ్లాక్ నుంచి ఉత్పత్తిని ప్రారంభించడానికి సింగరేణి సంస్థ సిద్ధమవుతున్నది. మే మొదటి వారం నుంచి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించేయోచనలో సంస్థ ఉన్నట్లు తెలుస్తున్నది. కంపెనీ చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ర్టాల్లో బొగ్గు తవ్వకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అనుమతులు కూడా లభించాయి. నైనీ బ్లాక్నకు సంబంధించి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి స్టేజ్-2 అనుమతులు ఇటీవల లభించాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దీంతో బొగ్గు ఉత్పత్తికి సంబంధించిన చర్యలను సింగరేణి యాజమాన్యం మరింత వేగం పెంచింది.
783 హెక్టార్ల భూమి అటవీ శాఖదే
ఒడిశా లోని నైనీ బొగ్గు బ్లాక్‌కు సంబంధించి అంగూల్జిల్లాలో 783 హెక్టార్ల భూమి అటవీ శాఖదే ఉంది. ఈ నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తికి సంబంధించి కేంద్రం నుంచి స్టేజ్-2 అనుమతులనేవి కీలకంగా మారాయి. కేంద్రం అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతుల కోసం సింగరేణీ సీఎండీ ఎన్ శ్రీధర్ పర్యవేక్షణలో అధికారులు తీవ్రంగా శ్రమించారు. దీంతో నైనీ బొగ్గు బ్లాక్‌కు సంబంధించి సంపూర్ణమైన అనుమతులు లభించినట్టు అయింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

