సీనియర్ నటులు జి.వి.నారాయణరావు, ప్రసాద్‌బాబు, నరసింహరాజు, రాజన్ హరి, మహర్షి రాఘవ, జయలలిత, బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రధారులుగా, వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఆలోచన’. సురేందర్ చాచా దర్శకుడు. ప్రదీప్‌కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మాతలు.
పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ రచయిత విజేంద్రప్రసాద్ విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా పాట, ట్రైలర్ త్వరలో విడుదల కానున్నాయని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: టి.సురేంద్రరెడ్డి, సంగీతం: వియాన్.