న్యూఢిల్లీ, నవంబర్ 19: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వాటాను విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. సెబీ మార్గదర్శకాలకు లోబడి నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాను విక్రయించబోతున్నది. వీటిలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్లు ఉన్నాయి. వీటిలో సెంట్రల్ బ్యాంక్లో కేంద్రానికి 93 శాతం వాటా ఉండగా, ఇండియన్ ఓవర్సీస్లో 96.4 శాతం, యూకోలో 95.4 శాతం, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్లో 98.3 శాతం వాటా ఉన్నది. మార్కెట్ రూల్స్ ప్రకారం స్టాక్ మార్కెట్లో లిైస్టెన సంస్థల్లో పబ్లిక్ షేరుహోల్డర్లు 25 శాతం వాటా కలిగివుండాలనే నిబంధనకు అనుగుణంగా కేంద్రం ఈ వాటాలను విక్రయించడానికి సిద్ధమైంది. ఆఫర్ ఫర్ సేల్ రూట్లో విక్రయించనున్న ఈవాటాను ఎప్పటిలోగా, ఎంత శాతం వాటా విక్రయించేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.