న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీతోపాటు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్‌పై సీబీఐ కేసు దాఖలు చేసింది. యూనియన్ బ్యాంక్‌కు రూ.228 కోట్ల మేర నష్టం వాటిల్లేలా తీసుకున్న నిర్ణయంపై ఈ కేసు నమోదు చేసింది.
బ్యాంక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ .. రిలయన్స్ హోం ఫైనాన్స్ లిమిటెడ్ డైరెక్టర్‌గా ఉన్న జై అన్మోల్ అంబానీతోపాటు రవీంద్ర శరద్ సుధాకర్‌పై కూడా కేసు దాఖలు చేసింది. ముంబై శాఖ నుంచి రిలయన్స్ హోం ఫైనాన్స్ కంపెనీ రూ.450 కోట్ల మేర రుణంగా తీసుకున్నారు.