న్యూఢిల్లీ, డిసెంబర్ 31: నూతన సంవత్సరంలో కార్లను కొనుగోలుచేయాలనుకునేవారికి ఆటోమొబైల్ సంస్థలు షాకిచ్చాయి. నిర్వహణ ఖర్చులతోపాటు ఉత్పత్తి వ్యయం పెరిగిందన్న సాకుతో వాహన సంస్థలు ధరలను 4 శాతం వరకు సవరిస్తున్నట్లు ఇదివరకే ప్రకటించాయి.
ఈ కొత్త ధరలు జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీతోపాటు జీప్, సిట్రాయిన్, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్, కియా, ఎంజీ, టాటాలతోపాటు లగ్జరీ కార్ల సంస్థలైన మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూలు తమ వాహన ధరలను 4 శాతం వరకు సవరిస్తున్నట్లు ప్రకటించాయి కూడా. ఆయా మాడళ్ల ధరలు బట్టి ఒక్క శాతం నుంచి 4 శాతం వరకు ప్రియంకానున్నాయి.