Carl Pei : రిమోట్ వర్క్ పద్ధతి ఇక వ్యాపారాలకు ఎంతమాత్రం సరైంది కాదని నథింగ్ సీఈవో కార్ల్ పీ స్పష్టం చేశారు. తమ లండన్ టీం వారానికి ఐదు రోజులు ఆఫీస్ నుంచి పనిచేస్తుందని ఆయన ప్రకటించారు. హైబ్రిడ్ మోడల్‌కు స్వస్తి పలుకుతున్నామని వెల్లడించిన పీ రెండు నెలల్లోగా పూర్తిస్ధాయిలో కార్యాలయాల నుంచి ఉద్యోగులు పనిచేయడం ప్రారంభమవుతుందని చెప్పారు. ఉద్యోగులు కలిసి చర్చించుకోవడంతో పాటు సత్వర నిర్ణయాలు వంటి కారణాలతో పని పద్ధతుల్లో మార్పు చేశామని చెప్పారు.
కంపెనీ భవిష్యత్ వృద్ధి, ఇన్నోవేషన్‌కు వారానికి ఐదు రోజులు కార్యాలయాల నుంచి పనిచేయడం అత్యంత కీలకమని కార్ల్ పీ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో వివరించారు. పూర్తి ఈ మెయిల్‌ను ఆయన తన లింక్డిన్ ఖాతాలో షేర్ చేశారు. కొద్ది సమయంలోనే తాము సుదీర్ఘ ప్రస్ధానానికి చేరుకున్నామని, గత పదేండ్లలో స్మార్ట్‌ఫోన్ బిజినెస్‌లో ప్రవేశించి ఇప్పుడు భారత్‌లో 567 శాతం వృద్ధితో వేగంగా ఎదుగుతున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచామని ఆయన పేర్కొన్నారు.
రిమోట్, హైబ్రిడ్ పని పద్ధతులు పలు కంపెనీలకు సరిపడినా నథింగ్ తన లక్ష్యాలను చేరుకునేందుకు అవి సహకరించబోవని వివరించారు. రాబోయే తరం టెక్నాలజీ కంపెనీగా నథింగ్ అవతరించేందుకు, ప్రత్యర్ధులకు దీటుగా వినూత్న ఉత్పత్తులను అందించేందుకు కార్యాలయాల నుంచి పనిచేసే వ్యవస్ధను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో కార్ల్ పీ వివరించారు.
Read More :