రాష్ట్రంలో ఫోక్స్‌వ్యాగన్ దూకుడు
జర్మనీకి చెందిన ప్రీమియం కార్ల విక్రయ సంస్థ ఫోక్స్‌వ్యాగన్..తెలుగు రాష్ర్టాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లలో ఒకేరోజు ఐదు నూతన షోరూంలను ప్రారంభించింది.
- ఒకేరోజు హైదరాబాద్‌లో 3 షోరూంలు ప్రారంభించిన సంస్థ
హైదరాబాద్, ఆగస్టు 30: జర్మనీకి చెందిన ప్రీమియం కార్ల విక్రయ సంస్థ ఫోక్స్‌వ్యాగన్..తెలుగు రాష్ర్టాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లలో ఒకేరోజు ఐదు నూతన షోరూంలను ప్రారంభించింది. వీటిలో హైదరాబాద్‌లో బంజారాహిల్స్, సికింద్రాబాద్, కూకట్పల్లి షోరూంలను ఆరంభించిన సంస్థ..ఏపీలో కర్నూల్, అనంతపురంలో టచ్పాయింట్లను ఏర్పాటు చేసింది. కస్టమర్లకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ఒకేరోజు ఐదు షోరూంలను ప్రారంభించినట్టు కంపెనీ బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు. దీంతో తెలుగు రాష్ర్టాల్లో కంపెనీ షోరూంల సంఖ్య 24కి చేరుకున్నది. అలాగే దేశవ్యాప్తంగా 184 విక్రయ కేంద్రాలు ఉండగా, 131 సర్వీస్ ఔట్లెట్లు ఉన్నాయి. ప్రస్తుతం సంస్థలో 250కి పైగా ప్రతిభ కలిగిన ఉద్యోగులు పనిచేస్తున్నారు. తెలంగాణ అంచనాలకుమించి రాణిస్తున్నదని, ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ రంగం మరింత బలోపేతం కావడంతో వాహన విక్రయాలు టాప్‌గేర్‌లో దూసుకుపోయే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

