న్యూఢిల్లీ, జూన్ 6: కార్ల తయారీలో సంస్థమారుతి సుజుకీ నూతన వాహన కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. ప్రస్తుత నెలలో అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండే అవకాశం ఉంటుందన్న అంచనాతో సంస్థ వినూత్న ప్రణాళికను తెరపైకి తీసుకొచ్చింది. మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉన్న మాడళ్లపై ప్రత్యేక రాయితీలు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన మాడళ్లపై రూ.74 వేల వరకు డిస్కౌంట్ కల్పిస్తున్నది. దీంతో నగదు డిస్కౌంట్‌తోపాటు ఎక్సేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఈ ఆఫర్ ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉండనున్నాయని పేర్కొంది. వీటిలో బాలెనో, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, జిమ్నీ, ఎక్స్ఎల్6, సియాజ్, ఇగ్నిస్ మాడళ్లు ఉన్నాయి.
నగదు రాయితీ కింద రూ.40 వేలు, ఎక్సేంజ్ బోనస్ కింద మరో రూ.15 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.2 వేలు కలుపుకొని మొత్తంగా రూ.57 వేల వరకు ప్రయోజనం లభించనున్నది. ఈ కారు ధర రూ.6.66-9.88 లక్షలు.
ఈ మాడల్‌ను కొనుగోలు చేసిన వారికి నగదు రాయితీ కింద రూ.15 వేలు, ఎక్సేంజ్ బోనస్ కింద మరో రూ.10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద మరో రూ.2 వేలు కలుపుకొని మొత్తంగా రూ.27 వేలు ప్రయోజనం కలగనున్నది. ఈ కారు రూ.7.51-13.04 లక్షల లోపు ధరలో లభించనున్నది.
ఈ కారుపై నగదు డిస్కౌంట్ కింద రూ.20 వేలు, ఎక్సేంజ్ బోనస్ కింద రూ.50 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద మరో రూ.4 వేలు రాయితీ ఇస్తున్నది సంస్థ. రూ.18.43 లక్షల ధర కలిగిన హైబ్రిడ్ మాడల్‌కు మాత్రమే ఈ ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తున్నది. ప్రస్తుతం మార్కెట్లో గ్రాండ్ విటారా రూ.11 లక్షల నుంచి రూ.20.09 లక్షల లోపు ధరలో లభిస్తున్నది.
ఈ మాడల్‌పై నగదు డిస్కౌంట్ కింద రూ.50 వేలు అందిస్తున్నది. కానీ, ఎక్సేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ వంటివి ఈ మాడల్‌పై సంస్థ ఇవ్వడం లేదు. రూ.12.74 లక్షల నుంచి రూ. 14.95 లక్షల లోపు ధరలో లభిస్తున్నది.
ఎక్సేంజ్ బోనస్ కింద రూ.20 వేలు డిస్కౌంట్ కల్పిస్తున్నది సంస్థ. ఈ మాడల్ రూ.11.61 లక్షల నుంచి రూ.14.77 లక్షల లోపు ధరను నిర్ణయించింది.
ఈ మాడల్‌పై నగదు డిస్కౌంట్ కింద రూ.20 వేలు, ఎక్సేంజ్ బోనస్ కింద మరో రూ.25 వేలు కలుపుకొని మొత్తంగా రూ.45 వేలు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నది. ఈ మాడల్ ధర రూ.9.40-12.29 లక్షలు.
నగదు రాయితీ రూపంలో రూ.40 వేల వరకు అందిస్తున్న సంస్థ.. ఎక్సేంజ్ బోనస్ కింద మరో రూ.15 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.3 వేలు కలుపుకొని మొత్తంగా రూ.58 వేలు ప్రయోజనాలు కల్పిస్తున్నది. ఆటోమేటిక్ వెర్షన్‌కు మాత్రమే ఈ ఆఫర్లు వర్తించనున్నాయి. ఈ కారు రూ.5.84 -8.11 లక్షలలోపు లభించనున్నది.