ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Business - Feb 09, 2021 , 01:55:30

కెనరా బ్యాంక్‌ రుణాలు చౌక

కెనరా బ్యాంక్‌ రుణాలు చౌక

బెంగళూరు, ఫిబ్రవరి 8: ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల్లో ఒకటైన కెనరా బ్యాంకు తమ రుణ వడ్డీ రేటును కుదించింది. ఒక రోజు నుంచి నెల రోజుల కాల పరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు)ను 10 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. కొత్త వడ్డీ రేటును ఫిబ్రవరి 7 నుంచే అమల్లోకి తెచ్చినట్లు ఆ బ్యాంక్‌ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో ప్రస్తుతం ఒక రోజు నుంచి నెల రోజుల కాల పరిమితి కలిగిన రుణాల వడ్డీ రేటు 6.70 శాతానికి దిగివస్తుందని తెలిపింది. మూడు నెలల కాల పరిమితి కలిగిన రుణాలపై 6.95 శాతం, ఆరు నెలల కాల పరిమితి కలిగిన రుణాలపై 7.30 శాతం, ఏడాది కాల పరిమితి కలిగిన రుణాలపై 7.35 శాతం వడ్డీ వసూలు చేయనున్నట్లు వివరించింది. 

VIDEOS

logo