న్యూఢిల్లీ, మార్చి 13: కెనరా బ్యాంక్ మరోసారి నిధులను సేకరించడానికి సిద్ధమవుతున్నది. బాసెల్-3 నిబంధనలకు లోబడి టైర్-2 బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.4 వేల కోట్ల నిధులను సమీకరించాలని యోచిస్తున్నది.
ఐదు లేదా పదేండ్ల కాలపరిమితితో ఈ బాండ్లను జారీ చేస్తున్నది. ఈ నిధుల సేకరణకు బ్యాంక్ బోర్డు అనుమతినిచ్చినట్లు పేర్కొంది.