Canada to accept Covaxin | ఇండియా నుంచి కెనడా వెళ్లే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ లభించనున్నది. కరోనా నియంత్రణకు భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ఈ నెల 30 నుంచి కెనడా గుర్తించనున్నది. దీని ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం పొందిన వ్యాక్సిన్లు వేసుకున్న ప్రయాణికులను ఈ నెలాఖరు నుంచి తమ దేశంలోకి అనుమతించనున్నట్లు తెలిపింది. కొవాగ్జిన్‌తోపాటు సినోఫార్మ్ (కొవిలో), సిఓవాక్ (కరోనావాక్) వ్యాక్సిన్లనూ కెనడా గుర్తించనున్నది.
ఇప్పటికే గుర్తించిన ఏ వ్యాక్సిన్ అయినా రెండు డోస్‌లు వేసుకున్న వారిని, మిశ్రమ డోస్‌లు వేసుకున్న వారిని అనుమతిస్తామని కెనడా తెలిపింది. జాన్సన్ అండ్ జాన్సన్ వారి సింగిల్ డోస్ జన్‌స్సెన్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి అనుమతి ఉంటుందని పేర్కొంది. అయితే ప్రయాణికులు కెనడాకు వెళ్లడానికి 14 రోజుల ముందు వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వజ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మహిళ రాధిక మన్నె.. ఎవరామె.. ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటి?
jai bhim | ఈమెదీ చినతల్లి లాంటి కథే.. కానీ న్యాయం ఇంకా జరగలేదు !
Password : ఇండియన్స్ కామన్‌గా వాడే పాస్వర్డ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Red crabs : కోట్ల సంఖ్యలో రోడ్ల మీదికొచ్చిన పీతలు.. స్థంభించిన జనజీవనం.. ఎక్కడో తెలుసా?
బిచ్చగాడి అంతిమయాత్రకు భారీగా జనం.. కారణం ఏంటి?