న్యూఢిల్లీ, ఆగస్టు 15: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడిన కేఫ్ కాఫీ డే గ్లోబల్ లిమిటెడ్(సీడీజీఎల్) ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికంలో రూ.24.75 కోట్ల నికర లాభం వచ్చినట్లు ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.11.73 కోట్ల నష్టాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఏడాది క్రితం రూ.189.63 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.223.20 కోట్లకు చేరుకున్నట్లు సంస్థ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కేఫ్ అవుట్లెట్ల సంఖ్యను 493 నుంచి 467కి తగ్గించింది. కానీ, వెండింగ్ యంత్రాలను 46,603 నుంచి 50,870కి పెంచుకున్నది. ఒక్కో ఔట్లెట్లో సరాసరి రోజుకు వచ్చే ఆదాయం రూ.19,537 నుంచి రూ.20,824కి పెరిగినట్లు వెల్లడించింది.