EV Car | న్యూఢిల్లీ, అక్టోబర్ 8: చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బీవైడీ..దేశీయ మార్కెట్లోకి మరో మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈమ్యాక్స్ 7 రూ.26.9 లక్షల నుంచి రూ.29.9 లక్షల మధ్యలో లభించనున్నది. వీటిలో ఆరుగురు కూర్చోవడానికి వీలుండే మాడల్ ధర రూ.26.90 లక్షలు, ఏడు సీట్ల మాడల్ ధర రూ.27.50 లక్షలు, సూపరియర్ మాడల్ రూ.29.30 లక్షల నుంచి రూ.29.90 లక్షల మధ్యలో లభించనున్నది.
దీంట్లో 55.4 కిలోవాట్ల బ్యాటరీ ప్రీమియం మాడల్ సింగిల్ చార్జింగ్‌తో 420 కిలోమీటర్లు ప్రయాణించనుండగా, అలాగే 71.8 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్ 530 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. 10.1 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు గంటకు 180 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. ఆటోమేటిక్ ైక్లెమెట్ కంట్రోల్, వైర్లెస్ చార్జర్, ఎయిర్ ఫ్యూరిఫైర్, మూడు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా బీవైడీఇండియా హెడ్ రాజీవ్ చౌహాన్ మాట్లాడుతూ..దేశీయంగా ప్రవేశపెట్టిన నూతన ఈవీ పాలసీలో ప్రయోజనాలు పొందడానికి దరఖాస్తు చేసుకునే అవకాశాలు లేవని స్పష్టం చేశారు.