650 కిలోమీటర్ల మైలేజీ
చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బీవైడీ..దేశీయ మార్కెట్లోకి నయా మాడల్‌ను పరిచయం చేసింది. మూడు వెర్షన్లలో లభించనున్న ఈ సరికొత్త కారు ప్రీమియం ఫీచర్లు, సింగిల్ చార్జింగ్‌తో 650 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కేవలం 15 నిమిషాల చార్జింగ్‌తో 200 కిలోమీటర్లు ప్రయాణించే ఈ మాడల్‌ను తొలుత బుకింగ్ చేసుకున్న కొనుగోలుదారులకు హోమ్ చార్జర్, వ్యారెంటీ ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
- సరికొత్త ఈవీని పరిచయం చేసిన బీవైడీ
- రూ.41-53 లక్షల శ్రేణిలోధర
న్యూఢిల్లీ, మార్చి 5: చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బీవైడీ..దేశీయ మార్కెట్లోకి నయా మాడల్‌ను పరిచయం చేసింది. మూడు వెర్షన్లలో లభించనున్న ఈ సరికొత్త కారు ప్రీమియం ఫీచర్లు, సింగిల్ చార్జింగ్‌తో 650 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కేవలం 15 నిమిషాల చార్జింగ్‌తో 200 కిలోమీటర్లు ప్రయాణించే ఈ మాడల్‌ను తొలుత బుకింగ్ చేసుకున్న కొనుగోలుదారులకు హోమ్ చార్జర్, వ్యారెంటీ ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ‘సీల్’ ఎలక్ట్రిక్ సెడాన్ పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ ప్రారంభ ధర రూ.41 లక్షలుగా నిర్ణయించిన సంస్థ..ప్రీమియం వెర్షన్ రూ.45.55 లక్షలు, సెడాన్ రకం రూ.53 లక్షలకు లభించనున్నది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ఎలక్ట్రానిక్ హైడెన్ ఫ్లష్ డోర్, 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్, ఆటోమేటిక్‌గా వర్షం సెన్సింగ్ వైప్స్, ఏసీ వెంట్స్ మార్చుకునే విధంగా డిజైన్ చేసింది. అదనపు స్థలం, భద్రత, పనితీరు ఆధారంగా రూపొందించిన మూడో మాడల్ ఇదేనని బీవైడీ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గోపాలకృష్ణన్ తెలిపారు. హైదరాబాద్‌లో బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈవీ ప్లాంట్ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడంపై ఆయన స్పందిస్తూ..డిమాండ్ ఏదైతేనేం, మేము ప్రభుత్వ నిబంధనల ప్రకారం దానిని తీర్చడానికి ప్రయత్నిస్తున్నాం,
కారు ప్రత్యేకతలు:
- కేవలం 3.8 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు సింగిల్ చార్జింగ్‌తో 650 కిలోమీటర్లు ప్రయాణించనున్నది
- ఈ కారు కోసం ముందస్తు బుకింగ్ చేసుకోవాలంటే రూ.1.25 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
- ఈ నెల 31లోగా బుకింగ్ చేసుకున్నవారికి 7 కిలోవాట్ల చార్జర్‌తోపాటు ఉచితంగా ఇన్స్టాల్ చేసి ఇవ్వడంతోపాటు 3 కిలోవాట్ల పోర్టబుల్ చార్జర్, మొబైల్ పవర్ సైప్లె యూనిట్‌ను అందిస్తున్నది.
- ఆరేండ్లపాటు రోడ్ అసిస్టేన్స్తోపాటు ఉచితంగా ఒకసారి సర్వీసింగ్ చేయనున్నట్లు తెలిపారు.
- ఈ కారు బ్యాటరీపై ఎనిమిదేండ్లు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వ్యారెంటీ, మోటర్/మోటర్ కంట్రోలర్‌పై ఎనిమిదేండ్లు లేదా 1.5 లక్షల కిలోమీటర్లు, డీసీ అసెంబ్లీపై ఆరేండ్లు లేదా 1.5 లక్షల కిలోమీటర్ల వ్యారెంటీ ఇస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- automobile
- Business news
- BYD
- BYD EV
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

