హైదరాబాద్, జూలై 15: రియల్టీ సంస్థ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ అనుబంధ సంస్థయైన బజ్వర్క్ తాజాగా హైదరాబాద్‌లో కో-వర్కింగ్ సెంటర్‌ను ప్రారంభించింది. 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ సెంటర్లో వెయ్యి మంది కూర్చోడానికి వీలుంటుంది.
సౌకర్యవంతమైన ఆఫీస్ స్థలాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సెంటర్‌ను నెలకొల్పింది.