న్యూఢిల్లీ, ఆగస్టు 15 : ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్.. ఎట్టకేలకు తన 4జీ మొబైల్ సేవలను దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రారంభించింది. తన భాగస్వామి నెట్వర్క్తో ఈ నూతన సేవలు అందిస్తున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
బీఎస్ఎన్ఎల్ నూతన కస్టమర్లు నేరుగా 4జీ సేవలు పొందవచ్చునని..బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ కస్టమర్ సెంటర్లు, ఎంపిక చేసిన డీలర్ల వద్ద నూతన సిమ్, ఈకేవైసీ చేసుకోవచ్చునని తెలిపింది.