న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18 : ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్, తపాలా శాఖ మధ్య తాజాగా ఓ వ్యూహాత్మక పొత్తు కుదిరింది. ఈ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న 1.65 లక్షలకుపైగా పోస్టాఫీసుల్లో ఇక బీఎస్ఎన్ఎల్ సిమ్‌కార్డ్ విక్రయాలు, మొబైల్ రిచార్జ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
గ్రామీణ, పట్టణ, నగరాలు అనే తేడా లేకుండా పోస్టాఫీసులు అంతటా ఉంటాయన్న విషయం తెలిసిందే. సరిగ్గా ఈ పాయింట్‌నే కస్టమర్లకు మరింతగా చేరువయ్యేందుకు ఉపయోగించుకోవాలని బీఎస్ఎన్ఎల్ భావిస్తున్నది.