BSA Gold Star 650 | మహీంద్రా అండ్ మహీంద్రా భాగస్వామ్యంతో ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ క్లాసిక్ లెజెండ్స్ (Classic Legends) భారత్ మార్కెట్లోకి బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 మోటారు సైకిల్ గురువారం ఆవిష్కరించింది. బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 మోటారు సైకిల్ ధర కలర్స్ వేరియంట్‌కు అనుగుణంగా రూ.2.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమై రూ.3.35 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది. ఆరు కలర్ ఆప్షన్లలో బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 మోటారు సైకిల్ లభిస్తుంది. హైలాండ్ గ్రీన్, ఇన్సిగ్నియా రెడ్, మిడ్నైట్ బ్లాక్, డాన్ సిల్వర్, షాడో బ్లాక్, షీన్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇప్పటికే బైక్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. మహీంద్రా గ్రూప్ భాగస్వామ్యంతో క్లాసిక్ లెజెండ్స్ నుంచి వస్తున్న యెజ్డీ, జావా మోటారు సైకిళ్ల బ్రాండ్లతో బీఎస్ఏ జత కలిసింది.
బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 మోటారు సైకిల్ 652సీసీ, 4-వాల్వ్, డీఓహెచ్సీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ మోటార్ తో పని చేస్తుంది. ఈ మోటారు గరిష్టంగా 6500 ఆర్పీఎం వద్ద 45బీహెచ్పీ విద్యుత్, 4000 ఆర్పీఎం వద్ద 55 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 5-స్పీడ్ గేర్ బాక్సు తోపాటు ఫ్రంట్ లో 320 ఎంఎం డిస్క్ బ్రేక్, రేర్ లో 255 ఎంఎం డిస్క్ బ్రేక్ ఉంటాయి. ఫ్రంట్‌లో 41ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్క్, బ్యాక్ 5-స్పీడ్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి. గరిష్టంగా గంటకు 160 కి.మీ దూరం ప్రయాణిస్తుందీ బైక్.
లీటర్ పెట్రోల్‌తో 30 కి.మీ మైలేజీ అందిస్తుందీ బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 మోటారు సైకిల్. 12 లీటర్ల కెపాసిటీ గల ఫ్యూయల్ ట్యాంక్ ఉంటది. 18 అంగుళాల ఫ్రంట్ టైర్స్ విత్ వైర్ స్పోక్డ్ వీల్స్, 17- అంగుళాల వీల్స్ ఎట్ రేర్, 12వాట్ల సాకెట్, యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ కూడా ఆఫర్ చేస్తోంది. ట్విన్ పాడ్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 (Royal Enfield Interceptor) మోటారు సైకిల్‌తో బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 (BSA Gold Star 650) మోటార్ సైకిల్ పోటీ పడుతుంది.