హైదరాబాద్, ఫిబ్రవరి 3: హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ టెక్ పార్క్లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని ప్రారంభించినట్టు బ్రిటన్కు చెందిన టెక్నాలజీ దిగ్గజం జీఐ అవుట్సోర్సింగ్ సంస్థ ప్రకటించింది. ఎనబ్లేర్తో కలిసి ఏర్పాటు చేసిన ఈ జీసీసీతో అంతర్జాతీయ క్లయింట్లకు టెక్నాలజీ సేవలు అందించనున్నట్టు ప్రకటించింది.
ప్రస్తుతం ఈ సెంటర్లో 50 మంది విధులు నిర్వహిస్తుండగా, వచ్చే 12 నెలల్లో 100 మందిని రిక్రూట్ చేసుకోనున్నట్టు, అలాగే 2028లో మరో వంద మందిని నియమించుకోనున్నట్టు కంపెనీ సీఈవో తారిఖ్ హుస్సేన్ తెలిపారు. ఇప్పటికే సంస్థకు ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్లో జీసీసీలు ఉండగా, నగరంలో నెలకొల్పిన జీసీసీ అతిపెద్దదన్నారు.