BPCL – Bio Fuel Bunker | కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) బయో-ఫ్యుయల్ విషయమై కీలక నిర్ణయం తీసుకున్నది. ముంబై నాకాశ్రయం వద్ద బయో ఫ్యుయల్ బ్లెండ్ హైఫ్లాస్ హైస్పీడ్ డీజిల్ (హెచ్ఎఫ్హెచ్ఎస్డీ) బంకర్ ఏర్పాటు చేసినట్లు శుక్రవారం తెలిపింది. షిప్పింగ్ కంపెనీలకు సంప్రదాయ ఇంధనానికి బదులు క్లీనర్, బయోడిగ్రేడబుల్ ఆల్టర్నేటివ్ ఫ్యుయల్ సరఫరా చేసేందుకు దేశంలోనే ఏర్పాటు చేసిన తొలి బంకర్ ఇది అని బీపీసీఎల్ పేర్కొంది. భారత్ బంకరింగ్ మార్కెట్లో సారధ్యం వహించే దిశగా పర్యావరణ సుస్థిరత దిశగా తొలి అడుగు అని వెల్లడించింది. కర్బన ఉద్గారాల రహితంగా నౌకాయానాన్ని తీర్చిదిద్దేందుకు తొలి అడుగు అని వివరించింది.
‘మా ప్రాజెక్టు పూర్తిగా హరిత ఇంధనంపైనే ఫోకస్ చేస్తుంది. తద్వారా భవిష్యత్ లో క్లీనర్ ఎనర్జీ దిశగా మా ప్రయాణం సాగుతుంది. బీపీఎస్ఎల్ ను గ్లోబల్ బంకరింగ్ లీడర్ గా తీర్చిదిద్దడానికి ముంబై నౌకాశ్రయంలోని బయో ఫ్యుయల్ బ్లెండ్ బంకర్ కీలక మైలురాయిగా నిలుస్తుంది’ అని బీపీసీఎల్ మార్కెటింగ్ డైరెక్టర్ సుఖ్మల్ జైన్ చెప్పారు. పశ్చిమ కోస్తా తీర ప్రాంతంలో మెరైన్లకు ఇంధన సరఫరాలో బీపీసీఎల్ కీలక పాత్ర పోషిస్తోంది. పర్యావరణ ప్రభావాన్ని, కర్బన ఉద్గారాల నియంత్రణ దిశగా మారిటైమ్ పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా కీలక పాత్ర పోషిస్తోంది. 2030 నాటికి నౌకాయానంలో క్లీన్ ఎనర్జీ అందుబాటులోకి తేవడమే నేషనల్ బయో ఫ్యుయల్స్ పాలసీ అండ్ మారిటైం విజన్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. ముంబై నౌకాశ్రయం ఆర్థికాభివృద్ధిలో ముంబై పోర్ట్ అధారిటీ, బీపీసీఎల్ కీలక పాత్ర పోషిస్తున్నాయి.
Jeep India Discounts | ఆ రెండు కార్లపై జీప్ ఇండియా డిస్కౌంట్.. గరిష్టంగా ఎంతంటే..?!