హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ): సరికొత్త ఆలోచనతో స్టార్టప్ పెడతారా? నిపుణులతో ఆ ఆలోచనను పంచుకోవాలనుకుంటున్నారా? హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ-సీఐఈ స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్‌ను సంప్రదించండి.
అందులోని బూట్ క్యాంప్‌లో మీ స్టార్టప్ ఆలోచనను పరీక్షించుకోండి. ఈ నెల 31, ఏప్రిల్ 1న సీఐఈ ఇంక్యుబేషన్ సెంటర్లో వివిధ రంగాల నిపుణులు విలువైన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ఇందులో ఐడియా వాల్యుయేషన్, మార్కెట్ అవసరాలు, సమస్యలు, రెవెన్యూ మాడల్, యూఎస్పీల నుంచి పోటీ, కస్టమర్ సెగ్మెంట్, గో టు మార్కెట్, వాల్యూ ప్రపొజీషన్ వంటి అంశాలపై నిపుణులు సహకరిస్తారు.