Varun Dhawan- Luxury Home | బాలీవుడ్ నలుడు వరుణ్ ధావన్, తన భార్యతో కలిసి ముంబైలోని జుహూ లోకాలిటీలో రూ.44.52 కోట్లకు లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేశాడు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న టవర్లో ఏడో ఫ్లోర్లో 5512 ఎస్ఎఫ్టీ విస్తీర్ణం గల ప్లాట్ కొనుగోలు చేసిందని డీడెకోర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. ఒక చదరపు అడుగుకు రూ.87 వేల పై చిలుకు పలికింది.
బాలీవుడ్ ప్రముఖులు సొంతం చేసుకున్న ఆస్తుల్లో ఇది అత్యంత కాస్ట్లీ డీల్ అని చెబుతున్నారు. ఈ టవర్లో ఇండస్ట్రీయల్, కార్పొరేట్ సంస్థల ప్రముఖులు నివాసులు కాబోతున్నారు. ఈ అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ కోసం వరుణ్ ధావన్ దంపతులు స్టాంప్ డ్యూటీ రూపేణా 2024 డిసెంబర్ మూడో తేదీన రూ.2.67 కోట్లు చెల్లించారని ఇండెక్స్టాప్ డాట్ కామ్ తెలిపింది. అయితే, ఈ అపార్ట్మెంట్ సేల్ చేసిన విషయమై డీ డెకోర్ యాజమాన్యం గానీ, వరుణ్ ధావన్ దంపతులు గానీ స్పందించలేదు.
ముంబై దేశంలోనే అత్యంత పెద్దదైన ఖర్చుతో కూడుకున్న రియల్ ఎస్టేట్ మార్కెట్. ముంబైలో పెద్ద పెద్ద ఇండ్లను పారిశ్రామిక ప్రముఖులు, సినీ నటులు, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కొన్నేండ్లుగా సొంతం చేసుకుంటున్నారు. అలా లగ్జరీ ఇండ్లు సొంతం చేసుకున్న బాలీవుడ్ ప్రముఖుల్లో అమితాబ్ బచ్చన్, రణ్వీర్ సింగ్, కార్తిక్ ఆర్యన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, రాణి ముఖర్జీ, అలియా భట్, దిశా పటానీ తదితరులు ఉన్నారు.