Boeing | విమానయాన దిగ్గజ సంస్థ బోయింగ్ (Boeing) తన ఉద్యోగులకు (employees) షాక్ ఇచ్చింది. పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. ముందుగా చెప్పినట్లుగానే ప్రపంచ వ్యాప్తంగా సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మందికి ఉద్వాసన పలికింది. అంటే 17 వేల మందిపై వేటు వేసింది.
సియాటెల్ ప్రాంతంలో 33,000 మంది కార్మికులు ఇటీవలే సమ్మె (strike)కు దిగిన విషయం తెలిసిందే. దీంతో 737 MAX, 767, 777 జెట్ల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఈ సమ్మె కారణంగా సంస్థ మూడో త్రైమాసికంలో 5 బిలియన్ డాలర్ల నష్టం చవిచూసింది. ఈ విషయాన్ని బోయింగ్ సంస్థ గత నెలలో వెల్లడించింది. ఈ నష్టాలను పూడ్చుకునేందుకు ఉద్యోగుల తొలగింపు అవసరమని సంస్థ సీఈవో కెల్లీ ఓర్ట్‌బెర్గ్ (Boeing CEO Kelly Ortberg) తెలిపారు.
‘రానున్న రోజుల్లో మొత్తం ఉద్యోగుల్లో సుమారు 10 శాతం మందిని తగ్గించాలని చూస్తున్నాం. వీరిలో ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లు ఉండనున్నారు’ అని ఆయన గత నెల ప్రకటించారు. అందుకు అనుగుణంగానే సంస్థ తాజాగా చర్యలు చేపట్టింది. మొత్తం 17,000 మంది ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులు జారీ చేస్తోంది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న పలువురు ఉద్యుగులు ఇప్పటికే ఈ లేఆఫ్ నోటీసులు అందుకున్నారు. వారు నిబంధనలకు అనుగుణంగా జనవరి వరకూ పేరోల్‌లో ఉండనున్నారు.
Also Read..
Anand Mahindra | ప్రింటింగ్ మెషీన్ దోశ.. ఆకట్టుకుంటున్న వీడియో
Matka Movie Review | మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా.?