హైదరాబాద్, జనవరి 12: ఈ నెల 18 నుంచి 21 వరకు హైదరాబాద్‌లో జరగనున్న ఎయిర్ షో ‘వింగ్స్ ఇండియా 2024’కు బోయింగ్‌కు చెందిన 777-9 విమాన సర్వీసు రాబోతున్నది. ఇప్పటికే భారత్‌లో అడుగుపెట్టిన ఈ విమాన సర్వీసు హైదరాబాద్‌లో జరగనున్న విమాన షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు, ప్రపంచంలో ఇదే అతిపెద్ద విమానమని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఈ నెల 16న హైదరాబాద్‌కు రానున్న ఈ విమాన సర్వీసు 18, 19 తేదిలో ఎయిర్‌షోలో కొలువుదీరనున్నది.