ముంబై, అక్టోబర్ 7: గృహ రుణాలపై వడ్డీరేటును పావు శాతం తగ్గిస్తున్నట్లు గురువారం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ప్రకటించింది. దీంతో రుణ రేటు 6.75 శాతం నుంచి 6.50 శాతానికి దిగొచ్చింది. తగ్గించిన వడ్డీరేట్లు వెంటనే అమలులోకి రానున్నట్లు వెల్లడించింది. ఈ పండుగ సీజన్లో తక్కువ వడ్డీకే గృహ రుణాలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు, అలాగే ఈ ప్రత్యేక వడ్డీరేటు డిసెంబర్ 31 వరకు అమలులో ఉండనున్నదని పేర్కొంది. ఈ నూతన వడ్డీరేట్లు కొత్తగా తీసుకునే రుణాలతోపాటు రుణాల బదిలీ లేదా పాత కస్టమర్లకు కూడా వర్తించనున్నదని వెల్లడించింది. దీంతోపాటు గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు ఎత్తివేత ఈ ఏడాది చివరి వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.