న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: రిజర్వుబ్యాంక్ పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) కూడా వడ్డీరేట్లను పావు శాతం మేర తగ్గించింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్‌తో అనుసంధానమైన రిటైల్, ఎంఎస్ఎంఈ విభాగానికి చెందిన రుణాలు మరింత చౌకగానున్నాయి.
కానీ, ఎంసీఎల్ఆర్ని బ్యాంక్ యథాతథంగా ఉంచింది. అత్యధిక మంది తీసుకునే ఏడాది కాలపరిమితి కలిగిన వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేటు 9 శాతం కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది.