హైదరాబాద్, సెప్టెంబర్ 11: ఈ నెల 13 నుంచి 14 వరకు హైదరాబాద్‌లో ఎంఎస్ఎంఈ ఎక్స్పో నిర్వహిస్తున్నట్టు బీఎన్ఐ హైదరాబాద్ ప్రకటించింది. చిన్న స్థాయి సంస్థలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, నైపుణ్యత కొరత వంటి సమస్యలు పరిష్కరించడానికి ఈ ఎక్స్పో, సెమినార్ నిర్వహిస్తున్నట్టు నిర్వహకులు వెల్లడించారు.
ఈ సదస్సుకు భారత్‌తోపాటు మధ్యప్రాచ్య దేశాలకు చెందిన 20 వేల మంది హాజరుకానున్నారు.