BMW X4 M40i | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ ఇండియా (BMW India)’ గురువారం తన పాపులర్ లగ్జరీ కూపే ఎస్యూవీ ఎక్స్4 స్పోర్టీ వేరియంట్ ‘ఎం40ఐ (M40i)’ ని ఆవిష్కరించింది. ఈ కారు కేవలం 4.9 సెకన్లలో 100 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. భారత్ మార్కెట్లో దీని ధర రూ.96.20 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. భారత్‌లో ఇది కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సీబీయూ)గా లభిస్తుంది. మెర్సిడెజ్ బెంజ్ -ఏఎంజీ జీఎల్సీ-43తో బీఎండబ్ల్యూ ఎక్స్4 ఎం40ఐ పోటీ పడుతుంది. లిమిటెడ్ ఎడిషన్ మాత్రమే విక్రయిస్తామని తెలిపింది. బీఎండబ్ల్యూ ఇండియా వెబ్సైట్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి.
బీఎండబ్ల్యూ ఎక్స్4 ఎం40ఐ కారు ఎక్స్టీరియర్గా ఎల్ఈడీ డీఆర్ఎల్‌తోపాటు స్లీక్ టెయిల్ ల్యాంప్స్, గ్లాసీ బ్లాక్ గ్రిల్లె, స్కిడ్ ప్లేట్లు, ఓఆర్వీఎంస్, న్యూ – 20 అంగుళాల గ్లాస్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ విత్ రెడ్ కాలిఫర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎక్స్ ఎం40 ఐ కారు బ్రూక్లిన్ గ్రే, బ్లాక్ సఫైర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
బీఎండబ్ల్యూ ఎక్స్4 ఎం40ఐ కారు ఇంటీరియర్‌గా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం 12.3 అంగుళాల ట్విన్టచ్ స్క్రీన్, డ్యుయల్ టోన్ ఇంటీరియర్ థీమ్ విత్ లెదర్ అప్ హోల్ స్టరీ, త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్, ఆంబియెంట్ లైటింగ్, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, రేర్ టైట్లింగ్ సీట్లు, పనోరమిక్ సన్ రూఫ్ తదితర ఫీచర్లు ఉంటాయి.
బీఎండబ్ల్యూ ఎక్స్4 ఎం40ఐ కారు కేవలం 4.9 సెకన్లలో 100 కి.మీ వేగంతో దూసుకెళుతుంది. గరిష్టంగా గంటకు 250 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. 48-వోల్టుల మైల్డ్ హైబ్రీడ్ టెక్నాలజీ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఎకో, ప్రో, కంఫర్ట్, స్పోర్ట్, స్పోర్ట్ ప్లస్ మోడ్స్‌లో లభిస్తుంది. 8-స్పీడ్ స్టెప్ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్‌తో ఇంజిన్ రూపుదిద్దుకున్నది.