BMW iX1 | ప్రముఖ జర్మనీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. భారత్ మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు ఆవిష్కరించడానికి సిద్ధమైంది. ఈ నెల 28న ఐఎక్స్1 (iX1) మోడల్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారు. లగ్జరీ కార్ల క్యాటగిరీలో వోల్వో సీ40 రీచార్జీ, కియా ఈవీ6 తదితర కార్లతో బీఎండబ్ల్యూ ఐఎక్స్1 ఈవీ ((iX1) పోటీ పడుతుందని భావిస్తున్నారు. ఈ కారు ధర రూ.రూ.70 లక్షల (ఎక్స్ షోరూమ్) లోపే పలుకుతుందని చెబుతున్నారు. ఎంట్రీ లెవల్ ఎక్స్ ఎస్యూవీ థర్డ్ జనరేషన్ మోడల్‌తోనే రూపుదిద్దుకున్నదీ ఐఎక్స్1 ((iX1).
బీఎండబ్ల్యూ ఎంట్రీ లెవల్ ఎక్స్ 1 ఎస్యూవీ కారుకు ఎలక్ట్రిక్ వర్షన్.. ఐఎక్స్1 ((iX1). ఈ ఐఎక్స్1 కారు రెండు వేరియంట్లు – ఈ డ్రైవ్ 20, ఎక్స్ డ్రైవ్ 30 వేరియంట్లలో మార్కెట్లోకి వస్తుందని చెబుతున్నారు. ఈ-డ్రైవ్ 20 వేరియంట్ సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్, ఎక్స్- డ్రైవ్ 30 వేరియంట్ డ్యుయల్ ఎలక్ట్రిక్ మోటార్ల సెటప్‌తో వస్తున్నాయి. ఈ కారు ఎలక్ట్రిక్ మోటారు గరిష్టంగా 313 బీహెచ్పీ పవర్, 494 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. కేవలం 5.6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌తో దూసుకెళ్ల గల ఐఎక్స్1 ((iX1) కారు గంటకు గరిష్టంగా 180 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. సింగిల్ చార్జింగ్ చేస్తే 475 కి.మీ దూరం ప్రయాణించగల కెపాసిటీ కలిగి ఉంది. రెండు వేరియంట్ కార్లలోనూ 64.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.
ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం డ్యుయల్ 10.7-అంగుళాల స్క్రీన్లు, డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఎయిరో డైనమికల్లీ డిజైన్డ్ మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్, రీ డిజైన్డ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ విత్ స్కిడ్ ప్లేట్స్, మల్టీపుల్ ఎయిర్ బ్యాగ్స్, టీసీఎస్, ఏబీఎస్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్, పార్క్ అసిస్ట్ తదితర ఫీచర్లు ఉన్నాయి.