న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: అన్ని వాహనాలను ఒకేచోట కొనుగోలుదారులకు అందించే ఉద్దేశంలో భాగంగా జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ..నూతనంగా రిటైల్.నెక్ట్స్ పేరుతో సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. ఈ సేవల్లో భాగంగా బీఎండబ్ల్యూ, మినీ, బీఎండబ్ల్యూ మోటరాడ్ మాడళ్లు ఒకే షోరూంలో లభించనున్నాయి.
ఈ నూతన సేవలకోసం వచ్చే మూడేండ్లకాలంలో బీఎండబ్ల్యూతోపాటు డీలర్లు రూ.365.6 కోట్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్లు బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా ప్రెసిడెంట్, సీఈవో విక్రమ్ పవాహ్ తెలిపారు.