న్యూఢిల్లీ, మార్చి 20: లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కూడా తన వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల నుంచి బీఎండబ్ల్యూ, మినీ కార్లు 3 శాతం వరకు సవరిస్తున్నట్లు వెల్లడించింది. కార్ల ధరలను పెంచడం ఈ ఏడాది రెండోసారి కావడం విశేషం. పెరగనున్న వాహన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న ట్లు కంపెనీ పేర్కొంది.
అంతకుముందు రెనో ఇండియా కూడా అన్ని రకాల మా డళ్ల ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతోపాటు నిర్వహణ ఖర్చులు అధికంకావడం, రూపాయి విలువ పడిపోవడం వంటి కారణాలతో సంస్థపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆటోమొబైల్ సంస్థలు ప్రకటించాయి.