నూఢిల్లీ, సెప్టెంబర్ 11: బీఎండబ్ల్యూ..దేశీయ మార్కెట్లోకి సరికొత్త మాడల్‌ను పరిచయం చేసింది. 6 సిరీస్‌లో భాగంగా ప్రవేశపెట్టిన గ్రాన్ టరిస్మో ఎం స్పోర్ట్ సిగ్నీచర్ మాడల్ ధరను రూ.75.90 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. కేవలం 6.5 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.