ముంబై, ఆగస్టు 12: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. బ్లూచిప్ సంస్థల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో వరుస లాభాలకు బ్రేక్పడినట్టు అయింది. ఇంట్రాడేలో 80 వేల పాయింట్ల దిగువకు పోయిన సెన్సెక్స్..
చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 368.49 పాయింట్లు కోల్పోయి 80,235.59 పాయింట్ల వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ 97.65 పాయింట్లు కోల్పోయి 24,487.40 వద్ద ముగిసింది.