ట్రంప్ ‘స్కాం’ దెబ్బ: 2 వారాల కనిష్టానికి బిట్ కాయిన్!!
ట్రంప్ ‘స్కాం’ దెబ్బ: 2 వారాల కనిష్టానికి బిట్ కాయిన్!!| బిట్ కాయిన్ సహా ఇతర డిజిటల్ కరెన్సీలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘స్కాం’....

లండన్: క్రిప్టో కరెన్సీ మేజర్ బిట్ కాయిన్ సహా ఇతర డిజిటల్ కరెన్సీలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘స్కాం’ విమర్శ తీవ్రంగానే ప్రభావం చూపినట్లు కనిపిస్తున్నది. మంగళవారం నుంచి మొదలైన డౌన్ ట్రెండ్ బుధవారం కూడా సాగింది.
బిట్ కాయిన్ విలువ 3.22 శాతం తగ్గి బుధవారం ఉదయం 7.30 గంటలకు రెండు వారాల కనిష్టానికి పడిపోయి 32,592.33 డాలర్లకు చేరుకున్నది. తద్వారా బిట్ కాయిన్ నెమ్మదిగా 30 వేల డాలర్ల దిశగా దౌడ్ తీస్తున్నది. జనవరి నుంచి ఇటువంటి డౌన్ ట్రెండ్ కనిపించలేదు.
గతేడాది చివరి నుంచి వాల్ స్ట్రీట్ బ్యాంక్స్ మొదలు టెస్లా సీఈవో ఎలన్ మస్క్ వంటి సెలబ్రిటీలు, ప్రొఫెషనల్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో బిట్ కాయిన్ విలువ పురోభివ్రుద్ధి దిశగా సాగింది. గతేడాది నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు బిట్ కాయిన్ సుమారు 800 శాతం లబ్ధి పొందింది.

గత ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో బిట్ కాయిన్ 64,870 డాలర్ల స్థాయిని తాకింది. కానీ అక్కడ నుంచి బిట్ కాయిన్ విలువ పతనం దిశగా ప్రయాణం ప్రారంభించింది. పర్యావరణ రిస్క్ ఉన్న నేపథ్యంలో తమ టెస్లా కార్లను కొనుగోలు చేసేవారి నుంచి బిట్ కాయిన్లను స్వీకరించబోమని ప్రకటించడంతో దీనికి కష్టాలు మొదలయ్యాయి.
సెకండ్ క్రిప్టో కరెన్సీ ఏథర్ సైతం బుధవారం ట్రేడింగ్‌లో 5.82 శాతం నష్టపోయి 2,446.88 డాలర్ల వద్ద నిలిచింది. బిట్ కాయిన్‌తో పోలిస్తే మరో క్రిప్టో కరెన్సీ డోస్ కాయిన్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. గత నెలలో సుమారు 70 సెంట్లకు చేరుకున్నా.. ప్రస్తుతం 31 సెంట్ల వద్ద ట్రేడవుతున్నది.
ఇవి కూడా చదవండి:
ఉద్యోగులకు ఆకర్షణీయ వీఆర్ఎస్?
వృద్ధిరేటు 8.3%కు కుదించిన ప్రపంచబ్యాంకు.. ఎందుకంటే?!
పియాజియో వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్, వేరియంట్లు ఇలా..
ఫ్రాంక్లిన్పై సెబీ రూ.5 కోట్ల ఫైన్
వృద్ధిరేటు 8.3%కు కుదించిన ప్రపంచబ్యాంకు.. ఎందుకంటే?!
ఆ రెండు బ్యాంకులపై ఆర్బీఐ ఫైన్.. ఎందుకంటే?!
ఇరాన్‌పై ఆంక్షలు ఎత్తేయకుంటే పెట్రోల్ పైపైకే!
కోవిడ్ ఔషధాలపై 5 శాతానికి జీఎస్టీ మినహాయింపు? ఇంకా..!!
బిట్ కాయిన్ ఒక స్కాం.. డాలర్‌కు వ్యతిరేకం
రేపు ఆకాశంలో ఆవిష్కృతమవనున్న అద్భుతం
జాతి వివక్ష ట్వీట్లు.. చిక్కుల్లో మరో ఇద్దరు స్టార్ ఇంగ్లండ్ క్రికెటర్లు
పీహెచ్సీలో ఆగిన రిఫ్రిజిరేటర్.. గడ్డకట్టిన 480 టీకా డోసులు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

