న్యూయార్క్, డిసెంబర్ 5: అదృశ్య కరెన్సీ బిట్‌కాయిన్ జెట్‌స్పీడ్ వేగంతో దూసుకుపోతున్నది. రోజుకొక రికార్డు స్థాయికి చేరుకుంటున్న ఈ బిట్‌కాయిన్ తాజాగా లక్ష డాలర్లకు చేరుకున్నది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంఫ్ గెలిచినప్పటీ నుంచి ఈ కరెన్సీ భారీగా పెరుగుతున్నది.
ఈ నేపథ్యంలో గురువారం బిట్‌కాయిన్ విలువ 103,400 డాలర్లకు ఎగబాకింది. ఈ ఏడాది ఈ అదృశ్య కరెన్సీని కొనుగోలు చేసిన వారు కోటీశ్వరులైనారని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.