న్యూయార్క్ : ఆర్ధిక మందగమనం నేపధ్యంలో కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యలు చేపడుతుండటంతో లేఆఫ్స్ (Mass Layoffs) ట్రెండ్ కొనసాగుతోంది. తాజాగా ప్రముఖ బయోటెక్నాలజీ కంపెనీ ట్విస్ట్ బయోసైన్స్ కార్పొరేషన్ మాస్ లేఆఫ్స్‌ను ప్రకటించింది. కంపెనీ రెండో క్వార్టర్లో మెరుగైన ఆర్ధిక ఫలితాలను ప్రకటించినా కొలువుల కోతకు తెగబడటం కలకలం రేపింది.
త్రైమాసిక ఫలితాలతో పాటు కంపెనీ సిబ్బందిలో 270 మందిని విధుల నుంచి తొలగించనున్నట్టు వెల్లడించింది. ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 25 శాతం కావడం గమనార్హం. పెట్టుబడులపై మెరుగైన రాబడులను అందించే క్రమంలో కీలక వాణిజ్య, అభివృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పలు చర్యలు చేపట్టినట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ ప్రక్రియలో భాగంగా వివిధ విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యను కుదించినట్టు పేర్కొంది. కంపెనీ లాభాలను కొనసాగించేందుకు అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలను మెరుగ్గా నిర్వహించాలని ట్విస్ట్ బయోసైన్స్ కార్ప్ నిర్ణయించింది. ఆర్‌అండ్‌టీ సహా పలు విభాగాల్లో బృందాలను క్రమబద్ధీకరించనున్నట్టు వెల్లడించింది. దీర్ఘకాల లాభాల వృద్ధి, విలువను సృష్టించే కార్యకలాపాలపై దృష్టి సారించనుంది.
Read More
Cognizant | ఏఐ టూల్స్‌పై కాగ్నిజెంట్ ఫోకస్..భారీ పెట్టుబడులకు సన్నద్ధం