Toll System | టోల్ వసూల్ వ్యవస్థలో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురాబోతున్నది. కొత్త ప్రతిపాదిత ఫాస్టాగ్ విధానం ఉద్దేశం హైవేలపై ప్రయాణాన్ని ఇబ్బందులు లేకుండా సులభతరం చేయడమే. తరుచూ జాతీయ రహదారులపై ప్రయాణం చేసే వారికి కేంద్రం వార్షిక పాస్‌ను తీసుకురాబోతున్నది. సంవత్సరానికి ఒకే సారి రూ.3వేలు చెల్లిస్తే దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ హైవేలు, స్టేట్ ఎక్స్‌ప్రెస్ హైవేలపై అపరిమితంగా ప్రయాణం చేసే సౌలభ్యం కలనుగన్నది. దాంతో తరుచూ ఫాస్టాగ్‌ను రీచార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం కేంద్రం ఫాస్టా్గ్ విధానంలో రెండు కొత్త పద్ధతులను తీసుకురావాలని యోచిస్తున్నది.
ఇందులో ఒకటి వార్షిక పాస్. వార్షిక సహాయంతో ఒక్కసారి ఫాస్టాగ్ ఫీజు చెల్లిస్తే సంవత్సరం మొత్తం అన్ లిమిటెడ్ హైవే జర్నీ చేసే అవకాశం ఉంటుంది. ఇందు కోసం అదనపు డాక్యుమెంట్స్ చూపించాల్సిన అవసరం కూడా ఉండదు. తక్కువ దూరం ప్రయాణించే వారు ప్రతి 100 వంద కిలోమీటర్లకు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. ఇప్పటికే ఫాస్టాగ్‌ని ఉపయోగిస్తున్న వారి ఇలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని.. కొత్తగా అకౌంట్‌ని తెరవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే పాత ఫాస్టాగ్ అకౌంట్ నుంచే కొత్త పాలసీని తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా.. రూ.30వేలు చెల్లిస్తే 15 సంవత్సరాల పాటు ‘లైఫ్‌టైమ్ ఫాస్టాగ్’ ప్రతిపాదన సైతం తీసుకురాగా.. ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇదిలా ఉండగా.. కేంద్రం కొత్త టోల్ పాలసీలో ఎలాంటి ఆటంకాలు లేని వ్యవస్థను తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. అంటే ప్రస్తుతం టోల్‌ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఇకపై ఉండదు. ప్రస్తుతం సెన్సార్ ఆధారిత వ్యవస్థను క్రమంగా తొలగించబోతున్నది.
దాంతో ట్రాఫిక్ జామ్‌లు తగ్గనున్నాయి. పెట్రోల్, డీజిల్ సైతం ఆదా కానున్నది. టోల్ ఆదాయంలో మార్పును భర్తీ చేసేందుకు.. ప్రభుత్వం డిజిటల్ డేటా ఆధారంగా పరిహార ఫార్ములాను రూపొందిస్తోంది. తద్వారా టోల్ కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీలు నష్టపోకుండా ఉంటాయి. ఇంకా, కనీస ఫాస్టాగ్ బ్యాలెన్స్‌లను నిర్వహించడం వంటి చర్యలను అమలు చేయడం ద్వారా టోల్ ఎగవేతను పరిష్కరించడానికి బ్యాంకులకు మరిన్ని అధికారులు ఇవ్వనున్నది. ఫాస్టాగ్ పాలసీ ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. అమలులోకి వస్తే భారత్‌లోని కోట్లాది మంది వాహనదారులకు ప్రయాణం చౌకగా.. వేగంగా, సులభతరంగా మారనున్నది.