న్యూఢిల్లీ, డిసెంబర్ 14: జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు చెందిన భూషణ్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్‌కు భారీ ఊరట లభించింది. సుప్రీంఆదేశాలకు అనుగుణంగా ఈడీ జప్తు చేసిన రూ.4,025 కోట్ల విలువైన ఆస్తులను పునరుద్ధరించింది.
కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ ప్రకారం దివాలా-ఐబీసీ కింద దివాల తీసిన కంపెనీ ఆస్తులను జేఎస్‌డబ్ల్యూ సరైన పరిష్కారం చూపించడంతో ఈడీ ఈ నిర్ణయం తీసుకున్నది. భూషణ్ స్టీల్‌కు చెందిన ఈ ఆస్తులను పీఎంఎల్ఏ చట్ట ప్రకారం గతంలో ఈడీ జప్తు చేసింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ సూచనల మేరకు ఈడీ ఛార్జీషిట్ దాఖలు చేసింది.