న్యూఢిల్లీ, మార్చి 21: విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థయైన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) మరో భారీ ప్రాజెక్టును దక్కించుకున్నది. గుజరాత్లో ఉకై సూపర్క్రిటికల్ థర్మల్ పవర్ నిర్మించతలపెట్టిన రూ.7,500 కోట్ల విలువైన 800 మెగావాట్ల పవర్ ప్లాంట్నకు సంబంధించి ఆర్డర్ లభించినట్లు కంపెనీ పేర్కొంది.
గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ నుంచి వచ్చిన ఈ ఆర్డర్ 54 నెలల్లో పూర్తి చేయాల్సివుంటుందని వెల్లడించింది.