న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.16,134.6 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,876.4 కోట్ల లాభంతో పోలిస్తే ఐదు రెట్లు పెరిగినట్లు వెల్లడించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.45, 129.30 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది.