న్యూఢిల్లీ, మే 16: భారతీ ఎయిర్టెల్ అంచనాలకుమించి రాణించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.3,005.6 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 14.31 శాతం ఎగబాకి రూ.31,500. 3 కోట్ల నుంచి రూ.36,009 కోట్లకు చేరుకున్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది.