న్యూఢిల్లీ, జనవరి 7 : వాహన పండుగ మళ్లీ వచ్చేసింది. ప్రతియేడాది ఢిల్లీ వేదికగా జరిగే ఈ వేడుక ఈసారి ఈ నెల 17 నుంచి 22 వరకు ఆరు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో భాగంగా జరుగుతున్న ఈ ఆటో ఎక్స్పోలో పలు ఆటోమొబైల్ సంస్థలు 40కి పైగా నూతన వాహనాలను విడుదల చేయడానికి సిద్ధిమవుతున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ విమల్ ఆనంద్ తెలిపారు. ఈసారి భారత్ మండపంతోపాటు యశోభూమి(ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్-ద్వార్కా), ఇండియా ఎక్స్పో సెంటర్ అండ్ మార్ట్, గ్రేటర్ నోయిడాలో జరుగుతున్నట్లు చెప్పారు. ఈసారి జరుగుతున్న ఆటో షోలో బ్యాటరీలు, టైర్లు కూడా ప్రదర్శించనున్నారు.