అమ్మకానికి భెల్ వాటా
విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థయైన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్)లో 5 శాతం వరకు వాటాను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) రూట్లో విక్రయించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం ప్రారంభం కానున్న ఈ వాటా విక్రయంలో షేరు ధరను రూ.254గా నిర్ణయించింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థయైన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్)లో 5 శాతం వరకు వాటాను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) రూట్లో విక్రయించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం ప్రారంభం కానున్న ఈ వాటా విక్రయంలో షేరు ధరను రూ.254గా నిర్ణయించింది. సంస్థలో మూడు శాతం వాటాను ఉపసంహరించుకోనుండగా, మరో రెండు శాతం వాటాను గ్రీన్ షో ఆప్షన్ కింద ఆఫర్ చేస్తున్నట్టు దీపం కార్యదర్శి అరుణిష్ చావ్లా తన ఎక్స్‌లో పేర్కొన్నారు.
నాన్-రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఈ వాటా విక్రయం బుధవారం ప్రారంభంకానుండగా, రిటైల్ ఇన్వెస్టర్లకు మాత్రం గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. 5 శాతానికి సమానమైన 17.41 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా కేంద్ర ఖజానాకు రూ.4,422 కోట్ల నిధులు సమకూరనున్నాయి. మంగళవారం కంపెనీ షేరు ధర రూ.276.05 కంటే 8 శాతం తక్కువకు రూ.254కి విక్రయించనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

