హైదరాబాద్, జూలై 10: బెంగళూరుకు చెందిన ఈవీ బైకుల తయారీ సంస్థ రీవర్..హైదరాబాద్‌లో తన తొలి స్టోర్‌ను బుధవారం ప్రారంభించింది. వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌లో కంపెనీకి చెందిన అన్ని రకాల వాహనాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. వ్యాపార విస్తరణలో భాగంగా తెలంగాణలో ప్రవేశించినట్లు, రాష్ట్రంలో ఈవీలకు డిమాండ్ అధికంగా ఉంటుందన్న అంచనాతో ఇక్కడే మరిన్ని స్టోర్లను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నదని కంపెనీ కో-ఫౌండర్, సీఈవో అరవింద్ మణి తెలిపారు.