హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రస్థానంగా రక్షణ రంగ పరికరాల తయారీ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్)… 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రానికి రూ.8.926 కోట్ల మేర డివిడెండ్ చెల్లింపులు జరిపింది. ఇందుకు సంబంధించిన చెక్‌ను కంపెనీ సీఎండీ సిద్ధార్థ మిశ్రా.. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు మంగళవారం అందజేశారు.