హైదరాబాద్, ఆగస్టు 17: ఫర్నిచర్ మార్కెట్లోకి బే విండో ప్రవేశించింది. తన తొలి అవుట్‌లెట్‌ను హైదరాబాద్ లో గురువారం ప్రారంభించింది. 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ షోరూంలో మధ్యస్థాయి లగ్జరీ జీవనశైలికి సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులు లభించనున్నాయని కంపెనీ ఎండీ సిద్దాంత్ తెలిపారు.
వచ్చే మూడేండ్లలో 10 నగరాల్లో రిటైల్ అవుట్లెట్లను ప్రారంభించనున్నట్లుప్రకటించారు. సరసనమైన ధరలకు ఆకర్షణీయమైన ఫర్నిచర్ అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. కంపెనీకి సంబంధించిన ఉత్పత్తులు ఈ-కామర్స్‌లో కూడా లభించనున్నాయని పేర్కొన్నారు.